అంతర్జాతీయ టెన్నిస్‌లో జకోవిచ్ సరికొత్త రికార్డు
సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ అంతర్జాతీయ టెన్నిస్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ గా నిలిచిన ఆటగాడిగా చరిత్రకు ఎక్కాడు. ఈ సందర్బంగా రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఐదు దఫాల్లో 311 వారాలు అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు జకోవిచ్ 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచాడు. గత నెల్లోనే తొమ్మిదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా 36 ఏటీపీ మాస్టర్స్ 1000 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. 2011, జులై 4న తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించిన జకోవిచ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)