నోములకు అసమ్మతి సెగ...

నోములకు అసమ్మతి సెగ...

టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు కొనసాగుతూనే ఉన్నాయి... ఓవైపు వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టి కేటీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో చివరి క్షణాల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి... జానారెడ్డి చేతిలో ఓటమిపాలైన నోముల నరసింహయ్యను అదే స్థానం నుంచి మరోసారి బరిలోకి దింపారు గులాబీ దళపతి... మరోవైపు నోముల నరసింహయ్యకు వ్యతిరేకంగా అసమ్మతి నేత ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో త్రిపురారంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. బీఫామ్ ఇచ్చే చివరి నిమిషం వరకు సాగర్ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని... ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఇక్కడి గ్రామాల మీద, రాజకీయాల మీద ఆయనకు అవగాహన లేదు...  అభ్యర్థిని మార్చాలని అధిష్టానాన్ని కోరతామన్నారు ఎంసీ కోటిరెడ్డి. ఇక్కడ జానారెడ్డి లాంటి వ్యక్తిని ఓడించాలంటే స్థానికునికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన... అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం... ఏ నిర్ణయం వచ్చినా అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.