మే నెల వ‌ర‌కూ మార్పులు లేవు...వాట్సాప్‌

మే నెల వ‌ర‌కూ మార్పులు లేవు...వాట్సాప్‌

గత కొన్ని రోజులుగా వాట్సాప్ లో గోప్యత విషయంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.  గోప్యత విధానాల పాలసీకి అంగీకరించకుంటే ఖాతాలను తొలగిస్తామని, తప్పనిసరిగా గోప్యతా పాలసీ విధానాన్ని అంగీకరించాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనేకమంది భయపడి వాట్సాప్ నుంచి బయటకు వచ్చేశారు.  పాలసీ విధానాన్ని అంగీకరిస్తే ఏమౌతుందో అనే భయంతో చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు.  దీనిపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది.  వాట్సాప్ విధానాల్లో ఎలాంటి మార్పులు లేవని,  గోప్య‌తా విధానాల మార్పు ఆల‌స్యం చేస్తున్న‌ట్లు ప్రకటించింది. మేనెల దాకా పాల‌సీ మార్పులు లేవని స్పష్టం చేసింది.  ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఖాతాను తొల‌గించ‌లేద‌ని వాట్సాప్ ప్రకటించింది‌. దీనికి సంబంధించిన విషయాన్నీ ఇన్‌యాప్ నోటిఫికేష‌న్ ద్వారా వాట్సాప్ ప్రకటించింది‌. ఇక, వాట్సాప్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 50 మిలియ‌న్ యూజ‌ర్లు ఉండగా,  దేశంలో 15మిలియన్ యూజర్లు ఉన్నారు.