రాష్ట్రమంతా ఎన్నికల హడావుడి..కానీ అక్కడ ఉండదు, ఎందుకంటే ?

రాష్ట్రమంతా ఎన్నికల హడావుడి..కానీ అక్కడ ఉండదు, ఎందుకంటే ?

రాష్ర్టమంతా పంచాయతీ ఎన్నికలు హడావుడి ప్రారంభమైంది. కాని అక్కడ ఆ ఉసే లేదు, అక్కడ ఒటర్లు వున్నారు. కానీ వాళ్లకి ఓటు హక్కు లేదు. రాష్ర్టమంతా ఒక్క దారి... ఆ ఉరు మాత్రం ఇంక్కో దారి... ఇంతకి ఆ ఉరు ఎక్కడా అనుకుంటున్నారా ? అదే తిరుమల. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే తిరుమల క్షేత్రంలో స్థానికులు పెద్ద సంఖ్యలోనే నివాసం వుంటారు. 1910 సంవత్సరం దాకా తిరుమలలో ఎవరూ నివాసం వుండేవారు కాదు. స్వామి వారికి పూజాది కార్యక్రమాలను కూడా తిరుపతి నుంచి వచ్చి నిర్వహించే వారు అర్చకులు.

దట్టమైన అటవి ప్రాంతం కావడంతో వన్య మ్రుగాలు సంచారం ఎక్కువగా వుండడంతో తిరుమలలో నివశించడానికి పెద్దగా ఎవరు ఆసక్తి చూపేవారు కాదు. తిరుమలలో స్థానికులు నివాసం వుండడం ప్రారంభం కావడంతో. వారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అలా ఒక దశలో తిరుమలలో నివాసం వుండే స్థానికులు సంఖ్య 30 వేలకు చేరుకోగా. ఓటర్ల సంఖ్య 20 వేలకు చేరుకుంది. అయినప్పటికి తిరుమలలో పంచాయితీ ఎన్నికలు ఇప్పటి వరకు నిర్వహించిన ధాఖలాలు లేవు. టిటిడిని బ్రిటిష్ ప్రభుత్వం 1933లో ఏర్పాటు చెయ్యగా 1953 నుంచి కూడా పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పాలకమండలిని నియమిస్తూ వచ్చింది.

మొదట్లో తిరుమల కూడా తిరుపతి గ్రామ పరిధిలోనే వుండేది. 1964 సంవత్సరం లోనే తిరుమలను ప్రత్యేక పంచాయితీ గా ఏర్పాటు చేసి అప్పటి. టిటిడి ఇఓ నర్శింగ్ రావుని పంచాయితి అధికారిగా నియమిస్తూ పంచాయితి ఎన్నికలను రద్దు చేసింది ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా టిటిడి ఇఓనే పంచాయితీ అధికారిగా వుంటూ వస్తున్నారు. దానితో తిరుమల ఓటర్లుకు ఎమ్మెల్యే, ఎంపిలను మాత్రమే ఎన్నుకునే అధికారం లభించగా పంచాయితిలో ప్రాతినిధ్యం కోల్పోయ్యారు. తరువాత తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చెయ్యడానికి స్థానికులును టిటిడి తిరుపతికి తరలించడం ప్రారంభించడంతో తిరుమలలో స్థానికుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతూ వచ్చింది.

ప్రస్తుతం స్థానికులు బాలాజి నగర్, ఆర్ బి సెంటర్ లో నివాసం వుండగా.... టిటిడి ఉద్యోగులు పరిమిత సంఖ్యలో క్వార్టర్స్ లో నివాసం వుంటున్నారు. దానితో 2019కి తిరుమలలో ఓటు హక్కు వున్న వారి సంఖ్య 5164 కి పడి పోయింది. ఇక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని 1996లో కూడా స్థానికులు కోర్టుని ఆశ్రయించినా వారికి నిరాశే ఎదురైంది. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం కావడం... రాజకీయాలుగా దూరంగా తిరుమలను వుంచడానికి పంచాయతీ ఎన్నికల రద్దుని సమర్దిస్తూ సుప్రింకోర్టు తీర్పు ఇవ్వడంతో పంచాయతీ ఎన్నికలకు తిరుమల ఓటర్లు శాశ్వతంగా దూరమయిపోయారు. దానితో రాష్ర్టంలో పంచాయితీ ఎన్నికల హడావుడి మొదలైన తిరుమలలో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు.