భారీ డిస్కౌంట్‌ ఇచ్చినా బంగారం కొనేవారు లేరట..!

భారీ డిస్కౌంట్‌ ఇచ్చినా బంగారం కొనేవారు లేరట..!

బంగారానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.. రేటు ఎంత పెరిగినా..? కొనడం మాత్రం పక్కా.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. లాక్‌డౌన్ సడలింపులతో బంగారం దుకాణాలు తెరిచినా కొనేవారు కరువయ్యారు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో నగల దుకాణాల కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారత్‌లో బంగారానికి 20శాతం మత్రమే డిమాండ్‌ ఉందని చెబుతున్నారు వ్యాపారులు. సాధారణంగా ఇది పెళ్లిళ్ల సీజన్. అయితే అనేక వివాహాలు వాయిదా పడటం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం గోల్డ్‌ ప్యూచర్స్‌ ధర రూ.47వేలకు పైగా పలుకుతుంది. దీంతో పసిడి కొనుగోళ్లకు రిటైల్‌ వినియోగదారులు మొగ్గు చూపడంలేదు. మరోవైపు చైనా వ్యాపారులు బంగారంపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించినా కొనేందకు రీటైలర్లు వెనకాడుతున్నారు. చైనా, హాంగ్‌కాంగ్‌ దుకాణాలలోని జువెలరీ దుకాణాల్లో అసలు వినియోగదారులే కనిపించడంలేదు. పైగా తమ వద్ద ఉన్న బంగారాన్ని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.