అన్ని రేప్ లకు మరణ శిక్ష కరెక్ట్ కాదు

అన్ని రేప్ లకు మరణ శిక్ష కరెక్ట్ కాదు

అన్ని రేప్ లకూ మరణ శిక్ష విధించడం ఒక్కటే సరైంది కాదని మధ్యప్రదేశ్ వ్యాఖ్యానించింది. ఐపీసీలో కొత్తగా చేర్చిన సెక్షన్ 376 ఏబీ కింద రేప్ చేసిన దోషులందరికీ మరణ శిక్ష ఖరారు చేయలేమని పేర్కొంది. 

మూడేళ్ల బాలికను తౌహీద్ అనే యువకుడు రేప్ చేశాడు. అయితే ప్రత్యక్ష సాక్షులు, మెడికల్ రిపోర్టులు, డీఎన్ఏ టెస్ట్ వంటి ఆధారాలతో ట్రయల్ కోర్టు తౌహీద్ కు మరణశిక్ష విధించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పుతో విభేదించిన హైకోర్టు.. శిక్షను యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా కోర్టు ఏమందంటే.. ఈ కేసులో పాశవికమైన ప్రవర్తన, క్రూరమైన చర్యలు లేవని, అందువల్ల అరుదైన కేసుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ఎంపీ హైకోర్టు ఈ ఒక్క నెలలోనే మూడు రేపు కేసుల్లో నిందితులను మరణశిక్ష నుంచి తప్పించింది.