థియేటర్లో 'వకీల్ సాబ్' హీరోయిన్... కరోనా తగ్గినట్లేనా?

థియేటర్లో 'వకీల్ సాబ్' హీరోయిన్... కరోనా తగ్గినట్లేనా?

ప్రముఖ సౌత్ హీరోయిన్ నివేదా థామస్ తాజాగా 'వకీల్ సాబ్'ను వీక్షించింది. ప్రేక్షకులతో హౌస్ ఫుల్ అయిన ఓ థియేటర్లో... చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి 'వకీల్ సాబ్'ను వీక్షించింది నివేదా. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫోటోలను కూడా పంచుకున్నారు. అంతేకాదు 'ఈ క్షణం కోసమే చూస్తున్నాను. మాటలు లేవు' అంటూ థియేటర్లో నిలబడి 'వకీల్ సాబ్'ను చూస్తున్న పిక్స్ షేర్ చేసింది. 'వకీల్ సాబ్' చిత్రంలోని ప్రధానపాత్రధారుల్లో నివేదా థామస్ కూడా ఒకరు. 'వకీల్ సాబ్'లో నివేదా పల్లవి అనే పక్కింటి అమ్మాయి పాత్రను పోషించగా... అందులో ఆమె నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే నివేదా థామస్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో... ఆమె 'వకీల్ సాబ్' సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అయితే నివేదాను థియేటర్లో చూసిన ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే నివేదా కరోనా నుంచి కోలుకుందా ? లేదా ? అనే విషయం తెలియదు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తరువాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం "వకీల్ సాబ్". ఈ చిత్రంలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.