నివర్ తుఫాన్ ఎఫెక్ట్: ఏడు జిల్లాల్లో ప్రజారవాణా నిలిపివేత...144 సెక్షన్ అమలు
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ తీవ్రంగా మారింది. ఈరోజు కరైకల్, మామళ్లపురం మధ్య తీరం తాగుతుంది. నివర్ తుఫాన్ తీరం దాటే సమయంలో దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, తీరం వెంబడి 125 నుంచి 140 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. గతంలో వచ్చిన గజ తుఫాన్ కంటే నివర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పుదుచ్చేరిలో 144 వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక చెన్నై సబర్బన్ సహా దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. ఏడు జిల్లాల్లో ఇప్పటికే ప్రజారవాణాను ప్రభుత్వం నిలిపివేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)