నివర్ ఎఫెక్ట్: నెల్లూరు, చిత్తూరులో భారీ వర్షాలు 

నివర్ ఎఫెక్ట్: నెల్లూరు, చిత్తూరులో భారీ వర్షాలు 

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారింది.  తీవ్ర తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.  ఈరోజు సాయంత్రానికి కరైకల్,  మహాబలిపురం ప్రాంతంలో తీరం దాటుతుంది.  దీనిప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.