నివర్ తుఫాన్ ఎఫెక్ట్: తిరుమలలో భారీ వర్షం... అప్రమత్తమైన అధికారులు... 

నివర్ తుఫాన్ ఎఫెక్ట్: తిరుమలలో భారీ వర్షం... అప్రమత్తమైన అధికారులు... 

నివర్ తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ పై కూడా ప్రభావం చూపుతున్నది.  చిత్తూరుజిల్లాలో దీని ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.  నవంబర్ మాసం కావడంతో తిరుమలలో చలిగాలులు వీస్తున్నాయి.  దీనికి భారీ వర్షం తోడవ్వడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. తిరుమలలో కూడా ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఘాట్ రోడ్ లలో కొండచరియలు విరిగిపడి అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు.