చిత్తూరు జిల్లాలో భారీ వర్షం...ప్రమాదం అంచున పలు కాలనీలు... 

చిత్తూరు జిల్లాలో భారీ వర్షం...ప్రమాదం అంచున పలు కాలనీలు... 

నివర్ తుఫాను ప్రభావం తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాపై కూడా కనిపిస్తోంది.  చిత్తూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.  చిత్తూరు జిల్లా మదనపల్లిలో గాలివాన బీభత్సాన్ని సృష్టిస్తోంది.  గాలివాన కారణంగా కాలువలు పొంగి పొర్లుతున్నాయి.  రహదారులపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.  మదనపల్లి-తంబళ్లపల్లి మార్గంలోని కన్నెమడుగులో పెద్ద పెద్ద వృక్షాలు విరిగిపడ్డాయి.  దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఇక వదలకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని పలు కాలనీలోకి వరద నీరు చేరింది.  ఉదయం నుంచి పట్టణంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.  వేంపల్లి చెరువు పూర్తిగా నిండిపోయింది.  పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీ, మేదర బజార్ కాలనీలు ప్రమాదం అంచున నిలిచాయి.  కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.