బాధకు ఎదురొడ్డి...

బాధకు ఎదురొడ్డి...

ఐపీఎల్ 2020 లో నిన్న మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రెండో మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఇందులో కోల్‌కత ఆటగాడు నితీష్ రానా అలాగే పంజాబ్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ కుటుంబాలలో విషాదం చోటుచేసుకుంది. నితీష్ రానా మామయ్య సురేందర్ నిన్న మరణించారు. కానీ ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్న రానా ఆ బాధను దిగమింగి ఢిల్లీ కి వ్యతిరేకంగా మ్యాచ్ ఆడాడు. అంతేకానుండ ఈ  మ్యాచ్ లో 81 పరుగులు చేసాడు. అయితే తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సురేందర్ అని ఉన్న జెర్సీని నితీష్ రానా చూపించాడు. దాని పైన తన మామయ్య వయసు (63) నెంబర్ ఉంది .

అలాగే రెండో మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ గా వచ్చిన మన్‌దీప్ సింగ్ తండ్రి కూడా నిన్న మరణించాడు. కానీ ఇండియాకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో అక్కడే ఉండి సన్‌రైజర్స్ పై ఆడిన మ్యాచ్ లో 17 పరుగులు చేసాడు. ఇక మన్‌దీప్ తండ్రి మరణానికి సంఘీభావంగా జట్టు సభ్యులు అందరూ బ్లాక్ బ్యాడ్జీలను ధరించారు.