మరోసారి నితిన్‌తో పూరి జగన్నాథ్!

మరోసారి నితిన్‌తో పూరి జగన్నాథ్!

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా అలరించనున్నాడు. విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత దర్శకుడు పూరి ఏ సినిమా చేస్తాడనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో గాసిప్స్ వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు పూరి తన తదుపరి సినిమా నితిన్ తో చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరూ ‘హార్ట్ ఎటాక్’ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి పూరితో నితిన్ సినిమా ఉండనుందని సమాచారం. పూరి చేయాలనుకున్న బడా హీరోలందరూ ఇప్పుడు చాలా ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. ఈ గ్యాప్ లో పూరి, నితిన్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.