బ్లాక్‌లో టికెట్లు అమ్మిన రాజమౌళి

బ్లాక్‌లో టికెట్లు అమ్మిన రాజమౌళి

దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తాజా చిత్రం ‘చెక్’. నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌ కానుండటంతో చెక్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం ఫిబ్రవరి 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడటానికి ముందు తొలి టికెట్‌ను రాజమౌళి, వరుణ్ తేజ్ కొనుగోలు చేశారు. బ్లాక్‌లో టికెట్ కొన్నామని రాజమౌళి ఈ వేడుకలో సెటైర్ వేశారు. ఫిబ్రవరి 26న విడుదలయ్యే చెక్ సినిమా ఎదురు చూస్తున్నాను అని రాజమౌళి తెలిపారు.