టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేత

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేత

డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలలో గుర్తింపు లేనివారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ లోకి భారీగా వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన టీడీపీ నేత గండ్ర‌త్ ర‌మేష్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో ర‌మేష్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ర‌మేష్ తో పాటు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన మైనార్టీలు, మ‌హిళ‌లు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు టీఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు సారంగాపూర్ మండ‌లంలోని పలు గ్రామాల‌కు చెందిన సుమారు 700 మంది గులబీ తీర్థం పుచ్చుకున్నారు.