సుగాలి ప్రీతి కేసు.. సీమా కుష్వాహ కీలక వ్యాఖ్యలు..

సుగాలి ప్రీతి కేసు..  సీమా కుష్వాహ కీలక వ్యాఖ్యలు..

సుగాలి ప్రీతి కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు నిర్భయ కేసు వాదించి విజయం సాధించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహ.. తమ కూతురు కేసులో న్యాయం చేయాలంటూ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.. సీమా కుష్వాహను కలిసి కేసు పూర్వాపరాలను వివరించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీమా కుష్వాహా.. ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేవారు.. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు నన్ను కోరారన్న ఆమె.. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అత్యాచారం జరిగిందని తేలింది.. ఈ కేసులో ప్రముఖులు జోక్యం చేసుకుంటున్నందున 8 రోజుల్లోనే నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. 

నవంబర్ 2వ తేదీ తర్వాత సుగాలి ప్రీతి కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాను అని తెలిపారు సీమా కుష్వాహ.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు కేసులో పురోగతి లేదన్న ఆమె.. నిందితుల వెనుక రాజకీయంగా బలమైన వ్యక్తులు ఉండటంతోనే న్యాయం జరగటం లేదని వ్యాఖ్యానించారు.. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రీతి కుటుంబ సభ్యులను డబ్బుతో, బలంతో లొంగదీసుకునేందుకు, బెదిరిస్తున్నారని.. వారికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టును కోరనున్నట్టు వివరించారు. నిందితుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పట్టించుకోవడం లేదని విమర్శించారు సీమా కుష్వాహ.