రివ్యూ : నిను వీడని నీడను నేనే

రివ్యూ : నిను వీడని నీడను నేనే

నటీనటులు: సందీప్ కిషన్, అన్య సింగ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ. 

సంగీతం : థమన్ 

సినిమాటోగ్రఫీ: పి.కె. వర్మ 

నిర్మాత: సందీప్ కిషన్ 

దర్శకత్వం: కార్తీక్ రాజు 

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ తరువాత సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్న సందీప్ కు కార్తీక్ రాజ్ కథ బాగా నచ్చడంతో నిర్మాతగా మారి సినిమాకు ప్రొడ్యూస్ చేస్తూ నటించాడు.  థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.  

కథ: 

అది 2035 వ సంవత్సరం.  సైకాలజీ ప్రొఫెసర్ మురళీ శర్మ ఓ కేసుకు సంబంధించిన వివరాలను స్టడీ చేస్తూ స్టూడెంట్స్ కు వివరిస్తుంటాడు.  అలా కథ 2035 నుంచి 2013 కు మారుతుంది.  సందీప్ కిషన్, అన్య సింగ్ లు కారులో వెళ్తుండగా.. సడెన్ గా యాక్సిడెంట్ అవుతుంది.  యాక్సిడెంట్ తరువాత ఈ ఇద్దరు ఓ స్మశానం మీదుగా ఇంటికి వెళ్లారు.  ఇంటికి వెళ్లిన తరువాత సందీప్ కిషన్ తన పేస్ ను అద్దంలో చూసుకోగా అతని స్థానంలో వెన్నెల కిషోర్ కనిపిస్తాడు.  దీంతో సందీప్ కిషన్ షాక్ అవుతాడు. అద్దంలో కనిపించిన వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు..? అతని ప్రయత్నం ఫలించిందా? వెన్నెల కిషోర్ ఎవరు? అన్నది సినిమా కథ.  

విశ్లేషణ: 

నిను వీడని నీడను నేనే... అంతస్తులు సినిమాలోని సాంగ్.  ఇది చాలా పాపులర్ సాంగ్.  ఆ సాంగ్ టైటిల్ ను సినిమాకు పెట్టుకోవడంతో.. సగం విజయం సాధించినట్టయింది.  సినిమా ఓపెనింగ్ కొంచెం సాగతీతగా అనిపించినా.. కాన్సెప్ట్ పరంగా సినిమాను నడిపిన తీరు ఆసక్తిగా సాగుతుంది.  ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్ ను కలిగించే విధంగా ఉండటంతో.. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.  సెకండ్ హాఫ్ ను చాలా థ్రిల్లింగ్ గా నడిపించారు.  సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.  మొత్తంగా సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడు థ్రిల్లింగ్ ఫీల్ కావడం ఖాయం అని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు: 

సందీప్ కిషన్ నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ, హర్రర్, సెంటిమెంట్, థ్రిల్లింగ్ అన్నింటిని తన నటనలో చూపించాడు.  గత సినిమాలతో పోల్చుకుంటే సందీప్ నటన చాలా మెరుగైంది.  హీరోయిన్ అన్య సింగ్ మొదటి సినిమా అయినా ఆమె నటన ఆకట్టుకుంది.  వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ తో మెప్పించాడు.  మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

కార్తీక్ రాజు తీసుకున్న కాన్సెప్ట్ మెచ్చుకోదగ్గది.  కార్తీక్ కాన్సెప్ట్ ను సందీప్ కిషన్ నమ్మి నిర్మాతగా మారి సినిమాను నిర్మించడం మరో విశేషం.  ఫస్ట్ హాఫ్ పై కార్తీక్ మరికొద్దిగా దృష్టిపెట్టి ఉంటె ఇంకా బాగుండేది.  థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది.  పీకే వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది.  

పాజిటివ్ పాయింట్స్: 

కాన్సెప్ట్ 

నటీనటులు 

థమన్ మ్యూజిక్ 

మైనస్ పాయింట్స్: 

ఫస్ట్ హాఫ్ లో సాగతీత 

చివరిగా : నిను వీడని నీడను నేనే - కాన్సెప్ట్ నీడలా వెంటాడుతుంది