రెండ్రోజుల నుండి తిరుమలలోనే నిమ్మగడ్డ.. రేపు కూడా అక్కడే !

రెండ్రోజుల నుండి తిరుమలలోనే నిమ్మగడ్డ.. రేపు కూడా అక్కడే !

రాష్ర్టంలో అన్ని పార్టిలు ఎన్నికలు హడవుడిలో ఉక్కిరిబిక్కిరి అవుతువుంటే .... ఎన్నికల నిర్వహించే ఉన్నతాధికారి మాత్రం తిరుమలలో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్ మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటూ కుటుంభసభ్యులుతో కాలక్షేపం చేస్తున్నారు. పని ఒత్తిడి ప్రభావమో.... లేక రిటైర్మెంట్ దగ్గరపడుతున్న సమయమనో... తెలియదు కాని.... రమేష్ కుమార్ అన్నింటికి దూరంగా.... కుటుంభసభ్యులుతో తిరుమలలో ప్రశాంతంగా గడుపుతున్నారు. మొన్నటి రోజు రాత్రి తిరుమల చేరుకున్న రమేష్ కుమార్.... నిన్న ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అటు తరువాతా గదికే పరిమితం అయ్యిపోయ్యారు. ఇవాళ ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న రమేష్ కుమార్....అటు తరువాతా కుటుంభసభ్యులుతో కలసి శనకనందతీర్దం, పాపవినాశనం డ్యాంలను సందర్శించారు. అటు తరువాతా పద్మావతి అతిథి గృహంకు చేరుకున్నారు. తిరిగి రేపు ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు నిమ్మగడ్డ. అయితే రమేష్ కుమార్ పర్యటనకు టిటిడి అధికారులు దూరంగా వుంటున్నారు. పది రోజులు క్రితం శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన సమయంలో అప్పటి టిటిడి జేఇఓ బసంత్ కుమార్ దగ్గర వుండి అన్ని ఏర్పాట్లు చెయ్యగా.... రమేష్ కుమార్ విజయవాడ చేరుకునే లోపు బసంత్ కుమార్ పై బదిలి వేటు పడింది. దానితో ఈ సారి పర్యటనలో టిటిడిలో అటెండర్ కూడా రమేష్ కుమార్ పర్యటనలో కనిపించడం లేదు. అటవి ప్రాంతంలో సందర్శనకి వెళ్ళిన సమయంలో కూడా రమేష్ కుమార్ వ్యక్తిగత భధ్రతా సిబ్బంది... అటవిశాఖ సిబ్బంది మాత్రమే కనిపించారు.