నాకు ఇచ్చే గిఫ్ట్ అదే.. నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు !

నాకు ఇచ్చే గిఫ్ట్ అదే.. నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు !

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతికి వస్తే సోంత ఊరికి వచ్చినంతా ఆనందం ఉందని ఆయన అన్నారు. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి రివ్వూ చేస్తానన్న ఆయన కరోనా కేసులు జిల్లాలో చాలా తగ్గాయని అన్నారు. తిరుపతి పర్యటక కేంద్రం కావడం వల్ల...కోద్దిగా కేసులు ఉన్నాయని, ఇప్పుడు సరైనా వాతావరణం ఉంది కాబట్టి ఎన్నికలకు వెళ్లామని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన మరి కోన్ని రోజుల్లో తమిళనాడు సహా మూడు రాష్ట్రాలలో ఎన్నికల జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం సహకరించాలని సుప్రీంకోర్టు సూచించిందని ఆయన అన్నారు. ప్రజలకు ఎప్పుడూ ఎన్నికలంటే భయం ఉండ కూడదు అని స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని వారికి కల్పించాలని అయన కోరారు. మార్చ్  31నేను రిటైర్ అవుతున్నానన్న ఆయన దానికి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే నాకు అధికారులు ఇచ్చే గిఫ్ట్ అని పేర్కొన్నారు. చిత్తూరులో గత ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల ఘర్షణలు జరిగాయని, గతంలో చిత్తూరులో జరిగిన ఏకగ్రీవాలపై గుడ్డిగా నిర్ణయం తీసుకోమని అన్నారు... బాగా పరిశోధన చేసి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.  నా నలబై ఏళ్ళు కాలంలో ఎప్పుడూ ఏ రాజకీయా నాయకున్ని ఒక్క మాట అనలేదని ఆయన అన్నారు. తప్పు చేస్తే భయపడాలి కానీ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన పనిలేదు....దైర్యంగా ముందుకు వెళ్ళాలని అన్నారు. స్వామీవారి ఆశిస్సులతో అందరికీ మంచి జరుగుతుందని అన్నారు.