ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు..!

 ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు..!

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నీలం సాహ్ని సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్‌లో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని జూన్ 30న రిటైరయ్యారు. దాంతో సాహ్ని సేవలు తమకు చాలా అవసరమని ఆమె పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం మూడు నెలలు మాత్రమే పొడిగించింది. ఇక తాజాగా మరో మూడు నెలలు పెంచాలని జగన్ సర్కార్ కోరగా కేంద్రం అనుమతిచ్చింది.