నిహారిక వెడ్డింగ్ కార్డ్.. సందడి షురూ
నాగబాబు కుమార్తె పెళ్లికి అన్ని హంగులు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ రిలీజైంది. ఈ నేపథ్యంలోనే నిహారిక, చైతన్య వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరుగనుంది.
ఈ పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లనున్నారు. ఇక అక్కడికి రాలేనివారికి, ఇతర బంధుమిత్రులకు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్లో వివాహ రిసెప్షన్‌ను ఇవ్వనుంది కొణిదెల కుటుంబం.
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ నిబంధలనకు అనుగుణంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆగస్టు 13వ తేదీన జరిగిన ఈ వేడుకకు కేవలం చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, అర్జున్ ఫ్యామిలీలతో పాటు చైతన్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)