నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ఫొటో వైర‌ల్

నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ఫొటో వైర‌ల్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు పెళ్లి పీటలెక్కే సమయం దగ్గర పడుతుండటంతో మెగా సంబరాలు షురూ అయ్యాయి. ఇప్పటికే కుటుంబం అంతా ఒక్కచోట చేరి ప్రీ వెడ్డింగ్ వేడుకను ఎంజాయ్ చేస్తుండడంతో నాగబాబు ఇంట్లో కోలాహలం కనిపిస్తోంది. 

పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న నిహారిక.. ఎప్పటికప్పుడు తన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల‌లో ఇద్ద‌రు అమ్మాయిలు నిహారిక కాళ్ళు ప‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, నిహా మాత్రం తెగ న‌వ్వేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక.. వాళ్ళు నా హీల్స్ సెట్ చేస్తున్నారు. ఒక పెళ్లి కూతురికి స‌హాయ‌కురాలిగా వాళ్ల క‌ర్త‌వ్యం బాగా చేస్తున్నారు. ల‌వ్ యూ గార్ల్ అంటూ నిహారిక కామెంట్ పెట్టింది. 

డిసెంబ‌ర్ 9వ తేదీన రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు చైతన్యతో, నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది.