మహారాష్ట్ర బాటలో యూపీ... నైట్ కర్ఫ్యూ అమలు 

మహారాష్ట్ర బాటలో యూపీ... నైట్ కర్ఫ్యూ అమలు 

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  దీంతో మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, గత కొన్ని రోజులుగా యూపీలో కూడా కేసులు పెరుగుతుండటంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  యూపీలోని కీలక నగరాలైన లక్నో, వారణాసి, కాన్పూర్ లలో నైట్ కర్ఫ్యూని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు ఈ మూడు నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది.  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  విద్యాసంస్థలు, కళాశాలలు ఈ మూడు జిల్లాల్లో మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.