ఐదు జిల్లాల్లో నైట్ కర్ప్యూ..ఎక్కడంటే..

ఐదు జిల్లాల్లో నైట్ కర్ప్యూ..ఎక్కడంటే..

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. కరోనాను అదుపుచేయడానికి రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. అయితే నైట్ కర్ఫ్యూ కేవలం కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విధించడం జరిగింది. రాష్ట్రంలోని ఇన్‌డోర్, గ్వాలియోర్ ‌జిల్లాలలో శనివారం నుంచి కర్ఫ్యూను అమలు చేశారు. నైట్ కర్ఫ్యూను అమలు చేయడానికి పోలీసులు కష్టపడ్డారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతోంది. జిల్లోలోని షాపులు అనుకున్న సమయం కన్నా ముందుగానే మూసివేశారు. కొన్ని దుకాణాలు పోలీసుల లేనందున తెరిచే ఉన్నాయి. అంతేకాకుండా పెట్రోల్ బంక్‌లకు తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. అయితే శనివారం ఒక్కరజులో ఇన్‌డోర్ జిల్లాలో 546 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,825కు చేరింది. గ్వలియోర్‌లోని అనేక మంది కర్ఫ్యూకు సహకరించినప్పటికి కొందరు మాత్రం కరోనా పెరగడానికి ఇటీవల జరిగిన బైపోల్ ఎన్నికలను నిందించారు. అంతేకాకుండా పోలీసులు దాదాపు అన్ని వాహనాలను వెతికారు. ప్రజలకు అత్యవసరా సేవలను అందిచారు. అయితే కంటోన్‌మెంట్ జోన్‌లలో పరిస్థితులను సీఎం రాష్ట్రంలోని క్రిసిస్ మేనేజ్‌మెంట్‌కు అప్పజెప్పారు. అయితే ఈ ప్రణాలికతో రాష్ట్రంలోని పరిస్థితులు ఎంతవరుకూ అదుపులోకి వస్తాయో చూడాలి.