పోలవరం మీద ఎన్జీటీ కీలక ఆదేశాలు

పోలవరం మీద ఎన్జీటీ కీలక ఆదేశాలు

పోలవరం పర్యావరణ నిబంధనల అమలు పర్యవేక్షణకు విశ్రాంత ( రిటైర్డ్) హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో చర్చించి రిటైర్డ్ జస్టిస్ పేరు ఖరారు చేస్తామని ఎన్.జి.టి ధర్మాసనం పేర్కొంది. ఐ.ఐ.టి, ఢిల్లీ, ఐ.ఐ.టి, హైదరాబాద్, భారత భూ పరిశోధన సంస్థ, కేంద్ర పర్యావరణ బోర్డు, జిల్లా కలెక్టర్ తో సహా పలువురు అదికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిచింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే భూ ఉపరితలం ఉప్పొంగడం, పగుళ్లు, కంపనాలు పరిసర ప్రాంతాలలో వచ్చాయని ఎన్.జి.టి ధర్మాసనానికి పిటీషనర్ తరపు న్యాయవాది వివరించారు. కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల ఎగువ ప్రాంతాలలో ముంపు ఏర్పడిందని ధర్మాసనం దృష్టికి పిటీషనర్ తీసుకెళ్ళారు. పర్యావరణ నియమ నిబందనలకు సంబంధించి గతంలో ఐ.ఐ.టి, ఢిల్లీ ఇచ్చిన నివేదికను పట్టించుకోనందువల్లే ఈ సమస్యలు వచ్చాయని పిటీషనర్ వాదించారు.  న్యాయస్థానాలలో కేసులు వేసినందుకుగాను, ప్రాజెక్టు కింద భూములు కోల్పోయున పిటీషనర్ కు, బంధువులకు కావాలని నష్ట పరిహారం చెల్లించడం లేదని ధర్మాసనానికి నివేదించారు. వెంటనే పరిహారం చెల్లించండని ఏపి ప్రభుత్వానికి ఎన్.జి.టి ధర్మాసనం ఆదేశించింది.