చమురు ఎఫెక్ట్: పెళ్లి గిఫ్ట్ గా పెట్రోల్, గ్యాస్ సిలిండర్... 

చమురు ఎఫెక్ట్: పెళ్లి గిఫ్ట్ గా పెట్రోల్, గ్యాస్ సిలిండర్... 

మనదేశంలో పెళ్లిని ఒక వేడుకలా నిర్వహిస్తారు.  పెళ్ళికి స్నేహితులు, బంధువులు అందరూ తరలివస్తారు.  తమ హోదాకు తగిన విధంగా వివాహాలు చేసుకుంటారు.  ఇక వివాహం అనంతరం కొత్త జంటను ఆశీర్వదించి వివిధ రకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు.  అయితే, ఇప్పుడు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయి.  వంట గ్యాస్ ధర కూడా పెరిగింది.  దీంతో స్నేహితుడి వివాహానికి అతని ఫ్రెండ్స్ ఓ వైరైటీ గిఫ్ట్ ను ఇచ్చారు.  ఐదు లీటర్ల పెట్రోల్, ఒక గ్యాస్ సిలిండర్, ఉల్లిపాయలతో తయారు చేసిన దండను గిఫ్ట్ గా అందించారు.  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.