మరో రూపం దాల్చిన మహమ్మారి!

మరో రూపం దాల్చిన మహమ్మారి!

బెర్లిన్: కరోనా మహమ్మారి రోజుకో కొత్త రూపంతో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవల లండన్, సౌతాఫ్రికాలలో ఈ వైరస్ కొత్త స్ట్రైయిన్ మొదలేన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం తయారైన వ్యాక్సిన్‌లు ఈ కొత్త రకం కరోనాపై పనిచేస్తాయా అని ప్రజల్లో సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ మహమ్మారి మరో కొత్త రూపం దాల్చింది. ఈ కొత్త రకం కరోనా జర్మనీలో వెలుగులోకి వచ్చింది. ఈ కొత్తరకం వైరస్ జర్మనీలో సోమవారం బయట పడింది. ఇప్పటికే చాలా మందిలో ఈ కొత్త రకం వైరస్‌ను వైద్యులు గుర్తించారు. దక్షిణ జర్మనీలోని ఓ ఆసుపత్రిలో దాదాపు 35మంది రోగులలో ఈ కొత్త వేరియంట్ కరోనా లభించింది. ఇది యూకేలో వచ్చినది కాదని, ఇది మరొ కొత్త రకమని అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇది కొత్త రకం అవడంతో వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడం లేదని అధికారులు అన్నారు. అయితే ప్రస్తుతం ఈ కొత్త రకం కరోనా దేబ్బతో ప్రజల్లోని భయం మరింత పెరిగింది. ఇప్పటి వరకు వచ్చిన వాటిపైనే వ్యాక్సిన్ పనిచేస్తుందా అనే ఆలోచన పక్కన పెడితే ఈ కొత్త రకం లక్షణాలేందనేది తెలియాల్సి ఉంది. దాంతో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఇది కూడా అదుపులోనే ఉందని అధికారులు అంటున్నారు.