వాట్సాప్‌లో మరో తాజా అప్‌డేట్..

వాట్సాప్‌లో మరో తాజా అప్‌డేట్..

ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న వినియోగారుల ముంగిట్లోకి కొత్త అప్‌డేట్స్‌తో వ‌స్తోంది. ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయ‌త్నిస్తోంది‌. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేరువైన ఈ మెసేజింగ్‌ యాప్‌లో త్వరలో మరో అప్‌డేట్‌తో రానుంది. ఇప్పటికే ఉన్న డిజప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లోనే మరో ఫెసిలిటీని చేర్చింది. ఇప్పుడు ఉన్న ఫీచర్‌ ఆధారంగా మెసేజులు వారం రోజుల తర్వాత వాటంతట అవే డిలిట్ అవుతాయి. అయితే, 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అయిపోయే ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపింది. డిజప్పియరింగ్‌ మెసేజెస్‌తో పాటు ఆర్కైవ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌లో కూడా కొన్ని మార్పులు చేయనుంది.