ప్రకాశం కుటుంబం వెలివేత ఘటనలో కొత్త మలుపు

ప్రకాశం కుటుంబం వెలివేత ఘటనలో కొత్త మలుపు

ప్రకాశం జిల్లాలో కుటుంబం వెలివేత కొత్త మలుపు తిరిగింది. తమ కుటుంబాన్ని వెలివేశారంటూ చిన్నారి రాసిన లేఖపై సీఎం జగన్ స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. రామచంద్రాపురం ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది పుష్ప. ఆమె తాత వెంకటేశ్వర్లు చేసిన ఓ పని గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. గ్రామానికి చెందిన 3.5 ఎకరాల భూమి తన పేరు మీద రాయించుకున్నాడని వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేశారు.

దీంతో వెంకటేశ్వర్లు  జులై 22న జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. అప్పట్లో అధికారులు విచారణ జరిపి గ్రామస్థులందరూ కలిసి ఉండాలని సూచించారు. అయినా పట్టువీడని గ్రామస్థులు ఈనె 6వ తేదీ పిల్లలను స్కూల్ కి పంపలేదు. దీంతో విచారణ జరిపిన అధికారులు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించామని చెబుతున్నారు. విద్యార్థిని పుష్ప సీఎం జగన్‌కి లేఖ రాసిందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ జరిపారు ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌.

రామచంద్రాపురం గ్రామంలో పరిస్థితి బాగనే ఉందని తెలిపారు. అసలు ఆ లెటర్‌ విద్యార్థిని రాయలేదని అంటున్నారు జాయింట్‌ కలెక్టర్‌ షన్మోహన్‌. చిన్నారి పుష్పతో పాటు విద్యార్థులందరూ బడికి వస్తున్నారని అధికారులకు వివరించారు టీచర్లు. ప్రస్తుతం గ్రామంలో అందరూ కలిసి చదువుకుంటున్నారని అక్కడ అంతా బాగుంటే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ ఎవరు రాశారనే ప్రశ్నకు తావిస్తోంది. అయితే ఈ లేఖ ఆకతాయిల పనిగా కొట్టి పారేస్తున్నారు అధికారులు.