ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో కొత్త ట్విస్ట్

ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో కొత్త ట్విస్ట్

ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేశ్‌ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది. పితాని దగ్గర అప్పట్లో పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ కూడా పిటిషన్ వేశారు. అయితే, ఈ అంశంలో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీలో ఈఎస్‌ఐ స్కామ్‌ కలకలంరేపింది. ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్‌లో 2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేసింది. 

పలు అవినీతి అక్రమాలు జరిగినట్లు నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఏసీబీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా 988.77 కోట్లా విలువైన మందులు, 150 కోట్లపైన వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ అక్రమాలలో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు తేల్చారు. ఈ కేసులో ఇప్పటివరకు అచ్చెన్నాయుడు సహా తొమ్మిది మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది.