ఆదా శర్మ 'క్వశ్చన్ మార్క్ ' మూవీ సాంగ్ లాంచ్

ఆదా శర్మ 'క్వశ్చన్ మార్క్ ' మూవీ సాంగ్ లాంచ్

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా క్వశ్చన్ మార్క్ (?). షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఈ చిత్రం లోని `రామ‌స‌క్క‌నోడివిరో` అనే పాట‌ను ఈ రోజు హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు. ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈ సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ...``ఈ చిత్రంలో మొద‌ట పాట పెట్టాల‌నుకోలేదు. షూటింగ్ పూర్త‌య్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి స‌త్యం గారు అద్బుత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్ ఆదాశ‌ర్మ‌గారు అద‌ర‌గొట్టారు. నిర్మాత గౌరికృష్ణ  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ద‌ర్శ‌కుల ప‌నితీరు ఏంటో ఈ పాట‌తోనే తెలుసుకోవ‌చ్చు. ఇక ఈ పాండ‌మిక్ టైమ్ లో ఈ సినిమా రావ‌డం కొంత సంతోషాన్ని క‌లిగించే విష‌యం`` అన్నారు. అలాగే హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ...``ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్ కి స్కోపున్న చిత్రాలే . అదే కోవ‌లో ఈ సినిమాలో కూడా న‌ట‌ను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్  మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. క‌రోనా టైమ్ లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైర‌క్ట‌ర్స్ ఎక్స్ లెంట్ గా డీల్ చేశారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది``ఆదా  చెప్పుకొంచింది