కేరళలో ఆ హీరోయిన్ పెళ్లి.. నిజమేనా...?

కేరళలో ఆ హీరోయిన్ పెళ్లి.. నిజమేనా...?

స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. విఘ్నేష్ శివన్ తో విదేశాల్లో హాలీడేస్ ను కూడా ఎంజాయ్ చేయడం.. సన్నిహితుల వేడుకలో కలిసి పాల్గొనడంతో వీరిద్దరు ఒకటి కావడం ఖాయమని వార్తలు వచ్చాయి, వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండటంతో త్వరలో వీరి పెళ్ళిఖాయమనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అదేంటఅంటే...  కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారట. వీరిద్దరూ అతి త్వరలోనే కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకోనున్నారని.. తక్కువ మంది బంధువులు మాత్రమే హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో నయన్ కూడా ఒకే అన్నట్లు తెలుస్తుంది. అందువల్ల నయన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని ప్రచారం నడుస్తుంది.