ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు... 

ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు... 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త మార్గదర్శకాలకు రిలీజ్ చేసింది.  దేశంలో కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారి నుంచి ఉద్యోగులను రక్షించుకోవడానికి ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.  జలుబు, దగ్గు వంటి ఆరోగ్యసమస్యలు ఉన్న వ్యక్తులు ఆఫీస్ లకు రావొద్దని స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఇంట్లో నుంచే పని చేయాలనీ సూచించింది.  ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే ఆఫీస్ లకు హాజరు కావాలని పేర్కొన్నది.  

ఆఫీస్ లో 20 కి మించి వ్యక్తులు ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నది.  కంటైన్మెంట్ జోన్లలో ఉండే వ్యక్తులు ఇంట్లో నుంచే పనిచేయాలని కేంద్రం పేర్కొన్నది.  ఆఫీస్ లో తప్పనిసరిగా మాస్క్ లు వాడాలని సూచించింది.  మాస్క్ వాడని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  కామన్ ఏరియాను ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్ చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.  ఇక కంప్యూటర్ కీ బోర్డు లను ఎవరికీ వారు శానిటైజ్ చేసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్రం.