కోవిడ్ విజృంభ‌ణ‌.. ఏపీలోని ఆ జిల్లాలో ప్రార్థ‌నా మందిరాలు మూత‌..

కోవిడ్ విజృంభ‌ణ‌.. ఏపీలోని ఆ జిల్లాలో ప్రార్థ‌నా మందిరాలు మూత‌..

క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెద్ద సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి.. దీంతో.. కొన్ని జిల్లాల్లో మినీ లాక్‌డౌన్ అమ‌లు చేస్తుండ‌గా.. మ‌రోవైపు నైట్ క‌ర్ఫ్యూ విధించి సంద‌ర్క‌ర్.. ఇక‌, డేం టైం కర్ఫ్యూ ఉంటుంది ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించ‌గా.. శ్రీ‌కాకుళం జిల్లాలో కోవిడ్ విజృంభణతో కీలక నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ జె.నివాస్... రేప‌టి నుంచి జిల్లాలోని అన్ని ప్రార్ధనా మందిరాలు మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. జిల్లాలోని ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల్లో ఎటువంటి  కార్యక్రమాలు నిర్వహించరాదని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. నిత్య ధూప దీప కార్యక్రమాలకు కేవలం అర్చకులు మాత్రమే అనుమతి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.