నయన్ బర్త్ డే స్పెషల్ : 'నెట్రికన్' టీజర్

నయన్ బర్త్ డే స్పెషల్ : 'నెట్రికన్' టీజర్

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ్ మూవీ ''నెట్రికన్''. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 'గృహం' చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా నేడు నయనతార బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతోంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించే నయనతార మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైందని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. టీజర్ తో తోనే ఆసక్తిని కలిగించిన   'నెట్రికన్' . ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.ఇటీవల 'మూకుతి అమ్మన్' తెలుగులో 'అమ్మోరు తల్లి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్