నయనతార 'నెట్రిక్కన్' ఫస్ట్ లుక్ విడుదల

నయనతార 'నెట్రిక్కన్' ఫస్ట్ లుక్ విడుదల

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత పదిహేడు సంవత్సరాలుగా లేడీ సూపర్‌స్టార్ గా కొనసాగుతున్న 'నయన్' గ్లామరస్ తారగా ఎంతటి పేరుతెచ్చుకుందో, అభినయం పరంగా కూడా అంతే పేరుతెచ్చుకుంది. అటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే.. అప్పుడప్పుడు ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తుంటుంది. తాజాగా ఓ థ్రిల్లర్‌తో ముందుకొస్తున్నారు. ‘గృహం’ ఫేమ్‌ మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో ‘నెట్రిక్కన్‌’ (మూడోకన్ను) అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు నయనతార. ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా విభిన్న తరహా పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేస్తారు. నిన్న విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభిస్తోందని విఘ్నేశ్ శివన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.