శ్రీరాముడిపై నేపాలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు... 

శ్రీరాముడిపై నేపాలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు... 

శ్రీరాముడిని భారతీయులు భక్తితో కొలుస్తారు.  నిత్యం ఆయనకు పూజలు చేస్తుంటారు.  శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడని, అక్కడ ఇప్పుడు ఆలయం కట్టబోతున్నారు.  అయితే,  నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  శ్రీరాముడు భారతీయుడు కాదని, నేపాలీ అని అంటున్నాడు.  అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందని అంటున్నాడు.  

నేపాల్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.  ఇప్పటికే భారత్ కు చెందిన కాలాపాని, లిపులేఖ్, లింపియాదూరా ప్రాంతాలు తమవే అంటూ నేపాల్ ఇటీవలే మ్యాప్ ను రిలీజ్ చేసింది.  ఇప్పుడు ఏకంగా శ్రీరాముడు భారతీయుడు కాదు నేపాలీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇంకెంతటి దుమారం రేపుతాయో చూడాలి.