మందిర్ నిర్మాణానికి రెడీగా ఉన్నాం

మందిర్ నిర్మాణానికి రెడీగా ఉన్నాం

అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం తాము సిద్ధంగా ఉన్నామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విజయదశమి ఉత్సవంలో పాల్గొన్న ఆయన... రామ మందిర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రామ మందిర్ అంశం మరోసారి హాట్ టాపిగ్గా మారుతోంది. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మందిర్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ప్రతిపాదించగా, ముంబైలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీని ఉద్దేశించి మీరు కట్టకపోతే మేమే మందిర్ నిర్మించి తీరతామని వ్యాఖ్యానించారు.