ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు 50 శాతం కూడా పూర్తికాని వ్యాక్సినేష‌న్..

ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు 50 శాతం కూడా పూర్తికాని వ్యాక్సినేష‌న్..

భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియు సాధ్య‌మైనంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.. అయితే, వ్యాక్సినేష‌న్ ప్రారంభం అయ్యిందే ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్ పంపిణీ జ‌రిగినా.. ఇంకా క‌రోనా వారియ‌ర్స్‌లో 50 శాతానికి పైగా మందికి వ్యాక్సిన్ అంద‌క‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.. దేశవ్యాప్తంగా 37 శాతం మంది ముందు క‌రోనా యోధుల‌కు మాత్ర‌మే రెండు డోసుల వ్యాక్సిన్ అందిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.. మొత్తం 3 కోట్ల మందిలో 91 ల‌క్ష‌ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే.. అది కూడా కేవ‌లం తొలి డోసు అంద‌గా.. మొత్తంగా రిజిస్ట‌ర్ చేసుకున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. మొత్తంగా రెండు డోసులు తీసుకున్న వారు కేవ‌లం 47 శాతం మంది మాత్ర‌మే ఉన్నారు.. అంటే.. ఈ లెక్క‌న క‌నీసం స‌గం మందికి కూడా వ్యాక్సినేష‌న్ పూర్తి కాలేదు.. ఇది ఆందోళ‌న క‌లిగించే అంశం అంటున్నారు నిపుణులు..


క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ముందు వ‌రుస‌లో ఉండి క‌నిపించ‌ని శ‌త్రువుతో పోరాటం చేశారు.. పారిశుద్ధ్య కార్మికులు, హెల్త్ వ‌ర్క‌ర్లు, వైద్యులు, పోలీసులు.. ఇలా.. అందుకే వారిని ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ అన్నారు.. తొలి ద‌శ ముగిసి సెకండ్ వేవ్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలోనూ ఇప్ప‌టికి 50 శాతానికి మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డం పెద్ద చ‌ర్చ‌గా మారింది.. ఇప్పుడు 45 ఏళ్ల‌కు పైబ‌డిన‌వారికి అందిర‌కీ వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుండ‌గా.. కోవిడ్ వారియ‌ర్స్‌కు వ్యాక్సినేష‌న్‌పై దృష్టిపెట్టాల‌ని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. కాగా, మొద‌ట్ల వ్యాక్సిన్ అంటే కొంత భ‌యం ఉండ‌గా.. క్ర‌మంగా ఆ భ‌యాలు తొలిగిపోయే.. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి పోటీ ప‌డే స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.