చిక్కుల్లో నయన్ మూవీ ..

చిక్కుల్లో నయన్ మూవీ ..

సౌత్ సినిమా ప్రేక్షకులకు నయన్ తార పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానముగా రెమన్యురేషన్ తీసుకునే స్టార్ నయన్. తెలుగులో వెంకటేష్ నటించిన 'లక్ష్మి' సినిమాతో పరిచయమైనా ఈ సుందరి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన 'సైరా' సినిమాలో నటించి మెప్పించింది నయన్. తాజాగా నయనతార అమ్మోరు తల్లి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో నయన్ అమ్మోరు గా కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తుంది. నయనతార దేవతగా నటించిన చిత్రం 'మూకుత్తి అమ్మన్‌'. ఆర్‌జె బాలాజీ హీరోగా నటిస్తూ.. యన్‌జె శరవణన్‌తో కలిసి సినిమాను డైరెక్ట్‌ చేశాడు. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్ అవుతోంది. సినిమాను దీపావళి కానుకగా.. ఈనెల 14న ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈమధ్య రిలీజైన టీజర్‌ ట్రైలర్‌లో అమ్మోరుని కించపరిచేలా సీన్స్‌ వున్నాయని.. హిందువుల మనో భావాలు దెబ్బతినేలా వున్నాయని ఆందోళనకు దిగారు. అమ్మోరు తల్లి ప్రదర్శన నిలిపివేయాలని కోరుతూ. కోర్టుకు వెళ్తామంటున్నారు ఆందోళన కారులు. దీంతో.. సినిమా రిలీజ్‌పై సందేహాలు నెలకున్నాయి. మరి వివాదమైన సీన్స్ తీసేసి రిలీజ్‌ చేస్తారా? లేదంటే కోర్టులో తేల్చుకుంటారో చూడాలి.