చిరు ‘లూసిఫర్’ కు నయన్ ఖాయం !

చిరు ‘లూసిఫర్’ కు నయన్ ఖాయం !

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్‌ 'లూసిఫర్‌' చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా మొదలైంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో చిరు ఇమేజ్‌కు తగ్గట్టు మార్పులు చేయబోతున్నారట. కాగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లుగా వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నయన్ ని తీసుకోవడం కన్ ఫర్మ్ అయ్యిందని టాక్. ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. నయన్ ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. యంగ్ హీరో సత్యదేవ్ భర్త పాత్రలో నయన్ కనిపించే అవకాశం కనిపిస్తోంది.