ప్రియుడి కౌగిలిలో బందీ అయిన నయనతార..

ప్రియుడి కౌగిలిలో బందీ అయిన నయనతార..

నయనతార మొదట శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించింది. చివరకు వారిద్దరితో కట్ చేసుకొని యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫ్ఫైర్ నడిపిస్తూ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ జోడీ హాట్ ఫొటో ఒకటి ఆన్‌లైన్ వేదికలను షేక్ చేస్తోంది. నయన్ విఘ్నేశ్ దీపావళి సెలెబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. కోయంబత్తూర్‌లో ప్రస్తుతం ఈ ఇద్దరూ ఓ హోటల్‌లో ఉన్నారని తెలుస్తోంది. హోటల్ రూంలో ఏకాంతంగా ఉన్న నయన్ విఘ్నేశ్ సోషల్ మీడియాలో మంట పెడుతున్నారు. ప్రియుడిని ఘాడంగా కౌగిలించుకుని ఒకరి కళ్లల్లో మరొకరు కళ్లు పెట్టి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ రొమాంటిక్ జర్నీ కొనసాగిస్తున్నారు.