నయనతార మళ్ళీ బ్రేకప్ చెప్పిందా?
నయనతార - ప్రభుదేవా బ్రేకప్ తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసి విజయపధంలో దూసుకుపోతున్నది. సోలోగా హిట్ సినిమాలు చేస్తూనే హీరోయిన్ గా కూడా మెప్పిస్తోంది. ఇలా సక్సెస్ లో దూసుకుపోతూనే ఈ అమ్మడు కొంతకాలంగా హీరో, దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
ఎక్కడికెళ్లినా సరే ఇద్దరు కలిసే వెళ్లేవారు.. అయితే, కొత్త సంవత్సరం వేడుకల్లో నయనతార ఒక్కరే పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో విగ్నేష్ తో బ్రేకప్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. పెళ్ళికి విగ్నేష్ తొందర చేస్తున్నారని, కానీ, నయన్ దానికి ఒప్పుకోవడం లేదని, దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, అందుకో కొత్త సంవత్సరం వేడుకల్లో నయన్ ఒక్కరే పాల్గొన్నారని అంటున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి ఉన్నది. నయనతార హీరోయిన్ గా చేసిన దర్బార్ సినిమా ఈనెల 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)