‘ప్రేమమ్' దర్శకుడితో నయన్
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార ఓ వైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలుచేస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది.
తాజాగా మలయాళంలో ఓ ఆసక్తికరమైన చిత్రానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘ప్రేమమ్' ఫేమ్ ఆల్ఫోన్స్ పుత్రన్ ఐదేళ్ల విరామం దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరిస్తూ ‘పట్టు’ పేరుతో మ్యూజికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
ఆడియో క్యాసెట్ నేపథ్యంలో టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో నయనతార గాయకురాలిగా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం నయనతార ప్రముఖ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ‘నెట్రికాన్’ అనే చిత్రంలో నటిస్తుంది. నయనతార 65వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)