మెగాస్టార్‌కు సిస్టర్‌గా స్టార్ హీరోయిన్.!

మెగాస్టార్‌కు సిస్టర్‌గా స్టార్ హీరోయిన్.!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు ఇప్పటికే ఖైదీ 150, సైరా సినిమాలతో మంచి విజయాలను అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరో మూడు సినిమాలు చేయబోతున్నారు. వీటిలో  మలయాళం లో సూర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్  చేసారు. ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికి వచ్చింది.  ఈ సినిమాలో సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారని తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయట. కానీ ఈ సారి మెగాస్టార్‌కు జోడిగా కాకుండా ఆయనకు గట్టిపోటీ ఇచ్చే సిస్టర్‌ పాత్ర కోసం అనుకుంటున్నట్లు టాక్‌. ఒరిజినల్‌ వైర్షన్‌ మలయాళంలో మంజు వారియర్‌ పోషించిన పాత్రకి నయనతార అయితే... ఇంపాక్ట్‌ చాలా బాగుంటుందని ఫిక్స్‌ అయ్యారట. సైరాలో భార్య, భర్తల్లా కనిపించిన చిరు-నయన్‌... లూసిఫర్‌లో మాత్రం అన్న-చెలెల్లిగా కనిపించనున్నారు. అయితే... దీనిపై త్వరంలోనే క్లారిటీ రానుంది.