నయనతారకు 'నటీమణి శ్రీదేవి' అవార్డు

నయనతారకు 'నటీమణి శ్రీదేవి' అవార్డు

హీరోయిన్‌ నయనతారను 'నటీమణి శ్రీదేవి' అవార్డు వరించింది... చెన్నైలో జీ-తమిళ్ 2020 సంవత్సరానికి గాను అవార్డులు నిర్వహించింది... స్థానికి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమంగా ఘనంగా నిర్వహించింది... అన్ని విభాగాల్లో సినీ ప్రముఖులకు అవార్డులు అందజేయగా... లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చాటుతోన్న నయనతారకు ఫేవరెట్ హీరోయిన్ పురస్కారం దక్కింది. అంతేకాదు... 'నణీమణి శ్రీదేవి' అవార్డును నయన్ సొంతం చేసుకుంది... నిర్మాత, శ్రీదేవి భర్త బోనీకపూర్ ఈ అవార్డును నయనతారకు అందజేశారు. ఇక, ఈ సందర్భంగా మాట్లాడిన నయన్... జీవితంలో సంతోషం మాత్రమే ఉంటే సరిపోదు... ప్రశాంతంత చాలా ముఖ్యమన్నారు. తాను ఇప్పుడు చాలా ప్రశాతంగా జీవిస్తున్నానని తెలిపారు.