ఆ బయోపిక్​పై నయనతార క్లారిటీ

ఆ బయోపిక్​పై నయనతార క్లారిటీ

తమిళనాడు రాణి బయోపిక్​లో తాను నటించట్లేదని లేడీ సూపర్ స్టార్ నయనతార వెల్లడించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా వేలు నాచియర్ చరిత్రకెక్కారు. ఈమె జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోందని, అందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోందని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని నయనతార కొట్టిపారేసింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. కథనాలు ప్రచురించే ముందు నిర్ధరణ చేసుకోవాలని లేఖలో సూచించింది. కాగా ఈ ఏడాది 'దర్బార్', 'అమ్మోరుతల్లి' సినిమాలతో నయనతార ప్రేక్షకుల ముందుకి వచ్చింది.