నితిన్ సినిమాలోని బోల్డ్ పాత్రలో స్టార్ హీరోయిన్...

నితిన్ సినిమాలోని బోల్డ్ పాత్రలో స్టార్ హీరోయిన్...

వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న నితిన్ `భీష్మ`తో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకుని మళ్లీ సక్సెస్ బాటపట్టాడు. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌ ‘అంధాధున్‌’ సినిమాను నితిన్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నాని 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక మోహన్ ని తీసుకున్నారట. అంధాధున్‌ సినిమాలో హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించింది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుంది. తెలుగులో ఈ కీ రోల్  లో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా టబు నే తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారట. కానీ కుదరలేదు. ప్రస్తుతం ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్ నయనతార ను సంప్రదిస్తున్నారట నిర్మాతలు. నయన్ ఒప్పుకుంటే ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరుగుతాయి. మరి ఈ ఆఫర్ కి నయనతార ఒకే చెబుతుందో లేదో చూడాలి.