హ్యాపీ బర్త్ డే నయన్..

హ్యాపీ బర్త్ డే నయన్..

నయనతార 1984వ సంవత్సరంలో ఓ మలయాళ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించారు. ఆ తరువాత హిందూ మతంలోకి మారారు. ఈమె మొదటి పేరు డయానా మరియం కురియన్.కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. నయన్ 2003వ సంవత్సరంలో మలయాళ చిత్ర సీమలోకి అడుగిడారు. 'ఈ', 'వల్లభ' సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన 'బిల్లా' సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. అయితే నయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం సూపర్ స్టార్ రజని కాంత్ ‘చంద్ర ముఖి’. ఈ సినిమాతో అటు తమిళ, తెలుగు భాషల్లో ఆమె పూర్తి స్తాయిలో గుర్తింపు పొందారు. అనంతరం ప్రముఖ నటీమణుల జాబితాలో చేరిపోయారు.

బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత ఎన్నో సినిమాలకు ప్రత్యేక పురస్కారాలు అందుకుంది నయన్.. సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది లేడీ సూపర్‌ స్టార్ నయనతార. శింబు, ప్రభుదేవాలతో లవ్ బ్రేకప్‌ తరువాత ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉంది. నేడు నయనతార పుట్టినరోజు..