ఆ రోల్ కోసం ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్న స్టార్ హీరోయిన్

ఆ రోల్ కోసం ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్న స్టార్ హీరోయిన్

హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పొచ్చు లేడీ సూపర్ స్టార్ నాయన తార అని. ఈ అమ్మడు తో సినిమా చెయ్యాలంటే అది కచ్చితంగా భారీ బడ్జెట్ సినిమా అయ్యుండాలి. ప్రస్తుతం ఈ అమ్మడు 2 కోట్లవరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల అమ్మోరు తల్లి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే... ఈ సినిమాలో నయన్ అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే నయన్ అమ్మవారి పాత్రలో నటించడం పై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వివాదంగా మారిన ఈ పాత్ర కోసం నయనతార ఏకంగా 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటికీ నయన్ తీసుకునేంత రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా నాలుగు కోట్లు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.